
ఇంతకీ అసలు విషయం ఏంటంటే….
భారత దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఓ చిన్న గ్రామమైన జడవల్లి గ్రామంలో 51 సంవత్సరాల క్రితం లైబ్రరీని నియమించడం అయినది. కాలక్రమేణ ఆ లైబ్రరీ బిల్డింగ్ యొక్క స్లాబ్ అచ్చులు ఊడి పడుతున్నందున లైబ్రరీని వినియోగించడం లేదు. ఆ తదుపరి కాలక్రమేన బిల్డింగ్ అంచున మర్రిచెట్టు మలవడమైనది. పలుమార్లు ఈ మర్రి చెట్టుని నరికి వేసినప్పటికీ,తగలబెట్టినప్పటికీ, చాలాసార్లు వేర్లు తొలగించినప్పటికీ ఎక్కడో గోడ లోపల దాగి ఉన్న వేరును మొలకెత్తుకుని ఎన్నిసార్లు నరికినప్పుడు ఉన్నంత చెట్టు కంటే మరింత పెద్దగా బిల్డింగ్ మొత్తాన్ని వేర్లతో అల్లుకుపోయిన మరింత దృఢంగా తయారయింది. ఈ విధంగా తయారవడం వలన ఈ లైబ్రరీ లోపలకి మరియు చుట్టుపక్కలకు పాములు, తేళ్లు,కాలేజేర్లు, మండర్ గబ్బిలాలు,గబ్బిలాలు వస్తున్నవి. ఈ లైబ్రరీ చుట్టూ నివాస ఇల్లులు కలవు. చిన్నపిల్లలు, ,కోళ్లు మిగిలిన జీవరాసులు ఈ లైబ్రరీ వైపు వెళ్ళినప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
